Rashmika Mandanna: ఎవరిని పెళ్లి చేసుకుంటారు?.. అంటే రష్మిక నుంచి ఊహించని సమాధానం

Rashmika Mandanna spoke about the man she wants to marry at Pushpa 2 event in Chennai
  • మీరు పెళ్లి చేసుకునే వ్యక్తి సినీ ఇండస్ట్రీకి చెందినవారా అని ప్రశ్నించిన హోస్ట్
  • ‘ప్రతి ఒక్కరికీ తెలుసు’ అని నవ్వుతూ సమాధానం ఇచ్చిన రష్మిక
  • విజయ్ దేవరకొండతో రిలేషన్‌ను ధ్రువీకరించిందంటున్న అభిమానులు
‘నేషనల్ క్రష్’ రష్మిక మందన్న, యంగ్ హీరో విజయ్ దేవరకొండ మధ్య రిలేషన్‌షిప్‌పై కొన్ని సంవత్సరాలుగా రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. పుంఖానుపుంఖాలుగా వార్తలు వెలువడ్డాయి. అయితే ఈ వార్తలను ఇద్దరూ ఎప్పుడూ ఖండించలేదు, అలాగని అంగీకరించలేదు కూడా. దీంతో అసలు వీరిద్దరి ఉన్న బంధం ఏంటనేది వారికి తప్ప ఎవరికీ తెలియదు. అయితే నిన్న (ఆదివారం) రాత్రి చెన్నైలో జరిగిన పుష్ప 2 ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడిన రష్మిక మందన్న.. విజయ్ దేవరకొండతో తన సంబంధాన్ని దాదాపు ధ్రువీకరించిన రీతిలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.

‘మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్న వ్యక్తి సినీ ఇండస్ట్రీకి చెందినవారా కాదా?’ అని హోస్ట్ ప్రశ్నించగా.. ‘‘ ప్రతి ఒక్కరికి తెలుసు. మీరు కోరుకున్న సమాధానం ఇదేనని నాకు తెలుసు’’ అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చారు. రష్మిక సమాధానం విని కార్యక్రమంలో ఉన్న అల్లు అర్జున్, శ్రీలీల, దేవిశ్రీ ప్రసాద్, పుష్ప 2 నిర్మాతలతో పాటు సెలబ్రిటీలు ముసిముసి నవ్వులు నవ్వారు. ఇక వేడుకకు హాజరైన అభిమానులైతే అరుపులు, కేకలు వేశారు. పేరు చెప్పకుండా విజయ్ దేవరకొండతో బంధాన్ని ఆమె అంగీకరించిందని, ఈ వ్యాఖ్యలతో ఫుల్ క్లారిటీ వచ్చిందని ఫ్యాన్స్ అంటున్నారు. 

యాదృచ్ఛికంగా విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న శ్రీలంకలోని ఓ ప్రదేశంలో లంచ్ చేస్తున్న ఫొటోలు ఆదివారం నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విజయ్ దేవరకొండ-12 సినిమా షూటింగ్ స్పాట్‌లో తీసిన ఫొటో అంటూ కథనాలు పేర్కొన్నాయి.

కాగా రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ తొలిసారిగా 2018లో ‘గీత గోవిందం’ సినిమాలో కలిసి నటించారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. ఆ తర్వాత డియర్ కామ్రేడ్ సినిమాలో కూడా కలిసి నటించారు. వీరిద్దరూ కలిసి తరచూ ట్రిప్‌లకు వెళ్లడం, ప్రత్యేక సందర్భాల్లో కలిసి కనిపించడం సర్వసాధారణంగా మారిపోయింది. వీరిద్దరి బంధంపై విజయ్ దేవరకొండ ఎప్పుడూ స్పందించలేదు. కానీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను డేటింగ్‌లో ఉన్నానని ధ్రువీకరించాడు. ‘‘నాకు 35 సంవత్సరాలు. నేను ఒంటరిగా ఉంటానని మీరు అనుకుంటున్నారా?’’ అని స్పష్టంగా చెప్పాడు.
Rashmika Mandanna
Vijay Devarakonda
Movie News
Tollywood

More Telugu News