పట్నం నరేందర్ రెడ్డిని ఉగ్రవాదిలా అరెస్ట్ చేశారు: కోర్టులో న్యాయవాది
- అరెస్ట్ చేసే సమయంలో పోలీసులు నిబంధనలు పాటించలేదన్న నరేందర్ రెడ్డి న్యాయవాది
- భూసేకరణకు వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు
- నరేందర్ రెడ్డి రెచ్చగొట్టడం వల్లే కలెక్టర్ మీద దాడి జరిగిందన్న పీపీ
- తీర్పును రిజర్వ్ చేసిన కోర్టు
ప్రభుత్వం తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాగేశ్వరరావు వాదనలు వినిపించారు. ఫార్మా విలేజ్ కోసం ప్రభుత్వం చేపట్టాలనుకున్న భూసేకరణకు వ్యతిరేకంగా ప్రజల్ని రెచ్చగొట్టేలా ఆయన మాట్లాడారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలిపారు. ఇందుకు సంబంధించి వీడియోలను సీడీల రూపంలో కోర్టుకు అందించారు. నరేందర్ రెడ్డి రెచ్చగొట్టడం వల్లే ప్రజలు, రైతులు... కలెక్టర్, ఇతర అధికారులపై దాడి చేసినట్లు తెలిపారు. నరేందర్ రెడ్డి కేబీఆర్ పార్కుకు వెళుతుంటే అరెస్ట్ చేసినట్లు చెప్పారు.
అరెస్ట్ చేసే సమయంలో పోలీసులు నిబంధనలు పాటించలేదని పట్నం నరేందర్ రెడ్డి తరపు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. అరెస్టుకు సంబంధించి కొన్ని ఫొటోలను కోర్టుకు సమర్పించారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది.