Konda Surekha: మరో వివాదంలో మంత్రి కొండా సురేఖ

Minister Konda Surekha Video Call goes Viral on Social Media
  • మంత్రి కొండా సురేఖ వీడియోకాల్‌ వైరల్‌
  • మనుమరాలి బర్త్‌ డే పార్టీలో బీరు బిర్యానీ పార్టీ 
  • దేవాదాయ శాఖ మంత్రి… ఇలాంటి పార్టీ చేసుకోవడం ఏంటని నెటిజ‌న్ల ఫైర్‌
తెలంగాణ‌ మంత్రి కొండా సురేఖ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. కొండా సురేఖ, ఓ మహిళ మధ్య జరిగిన సంభాషణ తాలూకు వీడియో ఒక‌టి నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఇటీవ‌లే మాజీమంత్రి కేటీఆర్‌, నటుడు నాగార్జున ఫ్యామిలీ గురించి అభ్యంత‌రకర వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో ఆమె వార్త‌ల్లో నిలిచారు. ఇప్పుడు ఆమె మాట్లాడిన వీడియో కాల్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

అందులో ఓ యువతితో సురేఖ మట్లాడుతూ... ఈ రోజు మా అందరికీ పండుగ ఉంది. బిర్యానీలు తెప్పిస్తున్నాం.. చిన్న పాప పేరు తోటి. మా టీమ్‌ టీమంతా కూడా ఇవాళ ఫుల్‌ ఎంజాయ్‌. బిర్యానీ ఉంటే బీర్‌ ఉంటది కదమ్మా పాపం. అఫీషియల్‌ సెలేబ్రేషన్‌ అంటే అఫీషియల్‌గా ఇచ్చేది. ఇక‌ అన్‌అఫీషియల్‌గా అంటే.. అన్నారు. 

అలాగే మరో వీడియోలో ఎవరు ఎక్కువ డ్యాన్స్‌ చేస్తే వాళ్లకు మందు ఎక్కువ అని మంత్రి చెప్ప‌డం ఉంది. అయితే ఈ వీడియోల‌ను ఎవరో సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారాయి. దీంతో కొండా సురేఖపై నేటిజన్లు మండిప‌డుతున్నారు. దేవాదాయ శాఖ మంత్రి... ఇలా బీరు బిర్యానీ పార్టీ చేసుకోవడం ఏంటని ప్ర‌శ్నిస్తున్నారు.

Konda Surekha
Video Call
Social Media
Telangana

More Telugu News