లక్ష కోట్ల అవినీతి అన్న రేవంత్ రెడ్డి... అతనిని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు?: కేఏ పాల్
- మేఘా కృష్ణారెడ్డి ఇప్పుడు రేవంత్ రెడ్డికి బెస్ట్ ఫ్రెండ్ అయ్యాడని విమర్శ
- దమ్ముంటే కృష్ణారెడ్డిని అరెస్ట్ చేయాలని సవాల్
- అదానీ, అంబానీలను బిలియనీర్లుగా చేసింది కాంగ్రెస్సే అన్న పాల్
కాళేశ్వరం అవినీతిపై కాగ్ నివేదిక తేటతెల్లం చేసిందని, ఈ ప్రభుత్వానికి దమ్ముంటే కృష్ణారెడ్డిని అరెస్ట్ చేయాలని సవాల్ చేశారు. ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటేనే సత్వర న్యాయం జరుగుతుందని, కోర్టు విచారణలతో ఏళ్లు పడుతుందన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను తాను కోర్టు ద్వారా నిలువరించానన్నారు. అవినీతి, ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని తాను న్యాయ పోరాటం చేస్తున్నానన్నారు. ప్రజలు తన పోరాటానికి మద్దతు పలకాలన్నారు.
అదానీ, అంబానీలను బిలియనీర్లుగా చేసింది కాంగ్రెస్సే
అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ, రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీలను బిలియనీర్లుగా చేసిందే కాంగ్రెస్ పార్టీ అని కేఏ పాల్ విమర్శించారు. ఇప్పుడు అదే అదానీని అరెస్ట్ చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఇది కాంగ్రెస్ ద్వంద్వ విధానాలకు నిదర్శనమన్నారు.