Adinarayana Reddy: గొడవ అదానీతో కాదు.. వైసీపీ వాళ్లతో: ఆదినారాయణరెడ్డి

Our fight is not with Adani group says Adinarayana Reddy
  • అదానీ పేరుతో వైసీపీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆదినారాయణరెడ్డి
  • జమ్మలమడుగుకు అదానీ సంస్థను ఆహ్వానిస్తున్నామని వ్యాఖ్య
  • వైసీపీ వాళ్ల జోక్యాన్ని సహించబోమని స్పష్టీకరణ
జమ్మలమడుగులో నిన్న జరిగిన ఘర్షణ వైసీపీ వాళ్లతోనే కానీ... అదానీ సంస్థతో కాదని బీజేపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆదినారాయణరెడ్డి అన్నారు. అదానీ పేరు చెప్పుకుని వైసీపీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. అదానీ సంస్థను జమ్మలమడుగుకు ఆహ్వానిస్తున్నామని చెప్పారు. 

సోలార్ పరిశ్రమ, అతిపెద్ద సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు అదానీ సంస్థ మొగ్గుచూపుతోందని తెలిపారు. ఇంకా రాని అదానీ పరిశ్రమలకు సబ్ కాంట్రాక్టర్లుగా చలామణి అవుతూ వైసీపీ వాళ్లు తెరిచిన దొంగ దుకాణాలను తమ అనుచరులు అడ్డుకున్నారని చెప్పారు. అదానీ గ్రూప్ తో తామే దగ్గరుండి పరిశ్రమలను పెట్టిస్తామని... వైసీపీ వాళ్ల అనవసర జోక్యాన్ని సహించబోమని తెలిపారు. అదానీ ముసుగులో వైసీపీ నేతలు రెచ్చగొట్టారని... అందుకే నిన్న గొడవ జరిగిందని చెప్పారు.
Adinarayana Reddy
BJP
Adani
YSRCP

More Telugu News