Allu Arha: అల్లు అర్హ తెలుగుకు ముగ్ధుడైన బాలయ్య... వీడియో వైరల్

Balakrishna surprised after Allu Arha speaks a difficult Telugu poem
  • బాలకృష్ణ హోస్ట్ గా అన్ స్టాపబుల్ టాక్ షో
  • హాజరైన అల్లు అర్జున్, అల్లు అర్హ
  • తెలుగు పద్యాన్ని అలవోకగా పలికిన అర్హ
  • తెలుగు భాషకు ఢోకా లేదన్న బాలయ్య
టాలీవుడ్ అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ఆహా ఓటీటీలో ప్రసారమయ్యే అన్ స్టాపబుల్ సీజన్-4 టాక్ షోకి అద్భుతమైన ప్రేక్షక స్పందన వస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హాజరైన ఎపిసోడ్ కు వ్యూస్ వెల్లువెత్తాయి. దీనికి సంబంధించిన క్లిప్పింగ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

ఇక సెకండ్ ఎపిసోడ్ లో అల్లు అర్జున్ తో పాటు ఆయన కుమార్తె అల్లు అర్హ, కుమారుడు అయాన్ కూడా సందడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో అందరినీ అలరిస్తోంది. 

అర్హ... నీకు తెలుగొచ్చా అమ్మా... అంటూ బాలయ్య ప్రశ్నించగా... తెలుగొచ్చా...! అంటూ అల్లు అర్జున్ అనడం... ఆ తర్వాత అర్హ "అటజని కాంచె..." అంటూ ఓ భారీ తెలుగు పద్యాన్ని అలవోకగా పలకడం... ఈ వీడియోలో చూడొచ్చు. 

అల్లు అర్హ తెలుగు భాషలోని కష్టమైన పదాలను పలికిన తీరు పట్ల బాలకృష్ణ ముగ్ధుడయ్యారు. "వాహ్" అంటూ మెచ్చుకున్నారు. అల్లు అర్జున్ కుమార్తె తెలుగు భాషను పలికిన తీరుపై బాలయ్య స్పందిస్తూ... తెలుగు భాషకు ఇక ఢోకాలేదన్నారు. తెలుగు భాష చల్లగా, నాలుగు కాలాల పాటు హాయిగా ఈ భూమ్మీద బతుకుతుందనిపిస్తుంది అని అర్హను ఆప్యాయంగా ముద్దాడారు. 
Allu Arha
Telugu Poem
Balakrishna
Allu Arjun
Unstoppable
Tollywood

More Telugu News