పోలీసుల విచారణకు డుమ్మా కొట్టిన వర్మ
- ఆర్జీవీని విచారించేందుకు ఒంగోలు పోలీసుల ఏర్పాట్లు
- చివరి నిమిషంలో విచారణకు రాలేనంటూ ఆర్జీవీ మెసేజ్
- నాలుగు రోజుల తర్వాత హాజరవుతానంటూ వాట్సాప్ లో సందేశం
సోషల్ మీడియాలో అసభ్య పోస్టులకు సంబంధించి ఆర్జీవీపై ఏపీ పోలీసులు ఇటీవల కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి విచారణకు రమ్మంటూ నోటీసులు కూడా జారీ చేశారు. మంగళవారం ఉదయం 11 గంటలకు ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో ఆర్జీవీని విచారించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేశారు. అయితే, వ్యక్తిగత పనులు ఉండడంతో విచారణకు హాజరుకాలేక పోతున్నానంటూ ఉదయం 10 గంటల ప్రాంతంలో ఆర్జీవీ పోలీసులకు సమాచారం అందించారు.