పెళ్లితో ఒక్కటైన టాలీవుడ్ సింగర్లు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పెళ్లితో ఒక్కటైన టాలీవుడ్ సింగర్లు

singers anurag kulkarni and ramya behara tied knot
  • పెళ్లితో ఒకటైన టాలీవుడ్ సింగర్లు
  • హైదరాబాద్‌లో సింగర్లు రమ్య బెహరా, అనురాగ్ కులకర్ణి వివాహం
  • పెళ్లిలో సందడి చేసిన గాయనీ గాయకులు, సినీ సంగీత దర్శకులు
తెలుగు సినీ ఇండస్ట్రీలో సింగర్లుగా మంచి పేరు తెచ్చుకున్న రమ్య బెహరా, అనురాగ్ కులకర్ణి వివాహ బంధంతో ఒకటయ్యారు. హైదరాబాద్‌లో జరిగిన వీరి పెళ్లి వేడుకలో ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలు, సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు గాయనీగాయకులు, సంగీత దర్శకులు సందడి చేశారు. తదుపరి నూతన వధూవరులను ఆశీర్వదించారు. నరసరావుపేటకు చెందిన రమ్య బెహర పలు సంగీత కార్యక్రమాలతో గుర్తింపు పొందగా, ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి ఆమెకు సినిమాలో ఛాన్స్ ఇప్పించారు. బాహుబలి ది బిగినింగ్‌లోని ధీవరా పాట ఆమెకు గుర్తింపు తెచ్చి పెట్టింది. 

కామారెడ్డికి చెందిన అనురాగ్ కులకర్ణి సూపర్ సింగర్ అనే కార్యక్రమం ద్వారా గాయకుడిగా తెలుగువారికి పరిచయం అయ్యాడు. ఈ కార్యక్రమంలో విజేతగా నిలవడంతో సినీ ఇండస్ట్రీలో అవకాశాలు వచ్చాయి. శతమానం భవతిలో మెల్లగా తెల్లారిందో, కాటమరాయుడులో మీరా మీరా మీసం, పైసా వసూల్‌లో టైటిల్ సాంగ్, ఇస్మార్ట్ శంకర్‌లో ఉండిపో ఉండిపో వంటి పాటలు ఆలపించాడు. ఆర్ఎక్స్ 100లో పిల్లా రా, కేరాఫ్ కంచరపాలెంలో ఆశాపాతం పాటలు కులకర్ణికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి.
Advertisement
Anurag Kulkarni

More Telugu News