మాజీ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ సంచలన ఆరోపణలు

Telangana Congress Sensational Tweet On KCR
  • రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించేందుకు ప్లాన్ చేశారని మండిపాటు
  • రైతుల ముసుగులో బీఆర్ఎస్ నాయకులతో గొడవలకు ప్రయత్నం
  • తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడానికి విధ్వంసకర వ్యూహాలు
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధ్యక్షుడు, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ పార్టీ సంచలన ఆరోపణలు చేసింది. తెలంగాణ వ్యాప్తంగా అల్లకల్లోలం సృష్టించేందుకు ఆయన కుట్ర పన్నుతున్నారంటూ మండిపడింది. ఈమేరకు గురువారం పార్టీ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి పోస్టు చేసింది. ప్రభుత్వ అధికారులు, కలెక్టర్ పై దాడిని బీఆర్ఎస్ పార్టీ సమర్థిస్తోందని ఈ ట్వీట్ లో విమర్శించింది. రైతులు, మహిళలు, నిరుద్యోగులంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులకు ముసుగువేసి దాడులకు ప్లాన్ చేస్తున్నారని ఆరోపించింది. రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోవడమే లక్ష్యంగా కేసీఆర్ వ్యూహాలు పన్నుతున్నారని మండిపడింది. 

వికారాబాద్ కలెక్టర్, అధికారులపై ఇటీవల లగచర్ల గ్రామంలో దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడి బీఆర్ఎస్ నాయకుల పనేనని ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ కేసుకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో ఈ దాడి వెనక మాజీ మంత్రి కేటీఆర్ పాత్ర ఉందంటూ పట్నం నరేందర్ రెడ్డి బయటపెట్టారని పోలీసులు తెలిపారు.
Go Back to Shorts
EX CM KCR
Telangana Congress
Lagacharla
Attack On Officers
BRS
KTR
KCR

More Telugu News