Tilak Varma: సెంచరీతో తిలక్ వర్మ సంచలనం... టీమిండియా భారీ స్కోరు

Tilak Varma super century gives Team India huge total against SA
  • టీమిండియా-దక్షిణాఫ్రికా మూడో టీ20
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా
  • నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 219 పరుగులు చేసి టీమిండియా
  • 56 బంతుల్లోనే 107 పరుగులు చేసిన తిలక్ వర్మ
  • 8 ఫోర్లు, 7 సిక్సర్లతో స్వైరవిహారం
తెలుగుతేజం తిలక్ వర్మ దక్షిణాఫ్రికాపై సెంచరీతో వీరవిహారం చేశాడు. ఈ యంగ్ డైనమిక్ బ్యాట్స్ మన్ 56 బంతుల్లోనే 107 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. టీమిండియా-దక్షిణాఫ్రికా మధ్య నేడు మూడో టీ20లో తిలక్ వర్మ చిచ్చరపిడుగులా చెలరేగడంతో పరుగులు వెల్లువెత్తాయి. అతడి స్కోరులో 8 ఫోర్లు, 7 సిక్సులు ఉన్నాయి. 

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 219 పరుగులు చేసింది. ఓపెనర్ సంజూ శాంసన్ (0) డకౌట్ కావడంతో తొలి ఓవర్లోనే బ్యాటింగ్ కు వచ్చిన తిలక్ వర్మ... సఫారీ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ లెఫ్ట్ హ్యాండర్ కొట్టే భారీ షాట్లకు ఆతిథ్య జట్టు బౌలర్లు బెంబేలెత్తిపోయారు. దాంతో లైన్ అండ్ లెంగ్త్ మర్చిపోయిన వాళ్లలా గతి తప్పిన బౌలింగ్ తో భారీగా పరుగులు సమర్పించుకున్నారు. 

మరో ఎండ్ లో ఓపెనర్ అభిషేక్ శర్మ మళ్లీ ఫామ్ లోకి వచ్చి, అర్ధ సెంచరీతో మెరిశాడు. అభిషేక్ శర్మ కేవలం 25 బంతుల్లోనే 50 పరుగులు చేయడం విశేషం. అభిషేక్ స్కోరులో 3 ఫోర్లు, 5 సిక్సులు ఉన్నాయి. 

ఇక, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (1) నిరాశపర్చగా... హార్దిక్ పాండ్యా 18, రింకూ సింగ్ 8, రమణ్ దీప్ సింగ్ 15 పరుగులు చేశారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఆండిలే సిమిలానే 2, కేశవ్ మహరాజ్ 2, మార్కో యన్సెన్ 1 వికెట్ తీశారు.
Tilak Varma
Century
Team India
South Africa
Centurion

More Telugu News