భార్య సాక్షితో కలిసి ఓటేసిన టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ
- కొనసాగుతున్న జార్ఖండ్ మొదటి దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
- రాంచీలోని ఓ పోలింగ్ బూత్‌లో ఓటు వేసిన ధోనీ దంపతులు
- వారిని చూసేందుకు ఎగబడ్డ అభిమానులు
ఇక ధోనీ దంపతులు రాంచీలో ఓటు వేసేందుకు రావడంతో వారిని చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు. దాంతో భద్రతా సిబ్బంది ధోనీ, సాక్షికి రక్షణ కల్పించి పోలింగ్ కేంద్రంలోకి తీసుకెళ్లారు. ధోనీ దంపతులు ఓటు వేసేందుకు వచ్చిన వీడియో ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తోంది.
కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా జార్ఖండ్‌లోని మొత్తం 81 స్థానాలకు రెండు విడతల్లో పోలింగ్ జరగనుంది. ఇవాళ తొలి విడత పోలింగ్ జరుగుతోంది. ఈ నెల 20న రెండో విడత పోలింగ్ జరగనుంది. ఈ నెల 23న ఫలితాలు వెల్లడవుతాయి.