Aghori: శ్రీకాళహస్తిలో మహిళా అఘోరి ఆత్మహత్యాయత్నం.. వీడియో ఇదిగో!

Women Aghori Suicide Attempt At Srikalahasti Temple
  • ఆలయంలోకి అనుమతించక పోవడంపై ఆగ్రహం
  • ఒంటిపై పెట్రోల్ పోసుకుని హల్ చల్ 
  • స్థానికులతో కలిసి బిందెలతో నీళ్లు కుమ్మరించిన పోలీసులు
ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాళహస్తి ఆలయం ముందు మహిళా అఘోరి ఆత్మహత్యాయత్నం చేయడం సంచలనంగా మారింది. ఒంటిపై, తన కారుపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేయడంతో స్థానికులు, పోలీసులు అడ్డుకున్నారు. బిందెలతో నీళ్లు కుమ్మరించి అఘోరికి వస్త్రాలు చుట్టారు. ఆలయం లోపలికి వెళ్లడానికి అనుమతించకపోవడం వల్లే అఘోరి ఆత్మహత్యా యత్నం చేసినట్లు సమాచారం.

తెలంగాణలోని సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడిలో దుండగులు విగ్రహాన్ని ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన తర్వాత మహిళా అఘోరి ముత్యాలమ్మ ఆలయం సందర్శించారు. ఆ తర్వాత నిత్యం ఏదో ఒక ఆలయాన్ని సందర్శిస్తూ వార్తల్లో నిలిచారు. సనాతన ధర్మం కోసం ఆత్మార్పణ చేసుకుంటానని ప్రకటించడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. దీంతో శాంతిభద్రతల సమస్య ఉత్పన్నమవుతుందని పోలీసులు మహిళా అఘోరిని రాష్ట్రం విడిచి వెళ్లాలని ఆదేశించారు. దీంతో మహారాష్ట్రకు వెళ్లిన అఘోరి.. అక్కడి ఆలయాలను సందర్శించుకున్నారు.

ఈ క్రమంలోనే మహిళా అఘోరి గురువారం అకస్మాత్తుగా శ్రీకాళహస్తిలో ప్రత్యక్షమయ్యారు. స్వామి వారి దర్శనం కోసం వెళుతుండగా పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహం చెందిన మహిళా అఘోరి.. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఎట్టిపరిస్థితుల్లోనూ స్వామిని దర్శించుకోకుండా వెళ్లబోనని, అవసరమైతే ఆత్మార్పణ చేసుకుంటానని బెదిరించారు. అయినా పోలీసులు గుడి లోపలికి అనుమతించకపోవడంతో కారు వద్దకు వెళ్లి ఒంటిపై పెట్రోల్ పోసుకున్నారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు.. స్థానిక మహిళలతో కలిసి అఘోరిపై నీళ్లు కుమ్మరించారు.
Aghori
Srikalahasti
Andhra Pradesh
suicide attempt
Viral Videos

More Telugu News