us president: చిరుధాన్యాలతో ట్రంప్ చిత్రం... విశాఖ ఆర్టిస్టు కళా నైపుణ్యం

portrait of us president donald trump with millets talent of visakha artist vijayakumar
  • మిల్లెట్లు ఉపయోగించి ట్రంప్ చిత్రం రూపొందించిన విశాఖ చిత్రకారుడు విజయ్ కుమార్
  • భారత్ - అమెరికా సంబంధాలు మరింత బలోపేతం కావాలని ఆకాంక్షిస్తూ ఈ విధంగా శుభాకాంక్షలు తెలిపినట్లు వెల్లడి 
  • చిత్రకారుడి కళానైపుణ్యానికి ప్రశంసలు
ఆమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ రెండోసారి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా డొనాల్డ్ ట్రంప్‌కు ప్రపంచ వ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ట్రంప్‌కు అభినందనలు తెలిపారు. ఇదిలా ఉంటే విశాఖకు చెందిన ఓ చిత్ర కారుడు తన కళానైపుణ్యంతో వినూత్నంగా డొనాల్డ్ ట్రంప్‌కు అభినందనలు తెలియజేయడం అందరినీ ఆకట్టుకుంది. 
 
విశాఖకు చెందిన చిత్రకారుడు మోకా విజయకుమార్ మిల్లెట్స్ (చిరుధాన్యాలు)తో ట్రంప్ చిత్ర పటాన్ని తయారు చేశాడు. చిరు ధాన్యాలతో ఎంతో సహజసిద్దంగా ట్రంప్ చిత్రాన్ని తయారు చేసిన విజయ్ కుమార్ అందులో విజయ చిహ్నాన్ని చూపుతున్నట్లుగా చిత్రంలో వెనుక భాగంలో ఆమెరికా జెండాను కూడా తీర్చిదిద్దాడు. 

భారత్ - అమెరికా సంబంధాలు మరింత బలోపేతం కావాలని ఆకాంక్షిస్తూ ఈ విధంగా ఆమెరికా అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలియజేసినట్లు విజయకుమార్ ఈ సందర్భంగా పేర్కొన్నాడు. విజయకుమార్ తయారు చేసిన ఈ చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో చిత్రకారుడు విజయకుమార్ కళానైపుణ్యాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.   
us president
Donald Trump
visakha artist vijayakumar
millets

More Telugu News