Rinku Singh: బంగ్లా కొనుగోలు చేసిన యంగ్ క్రికెటర్ రింకూ సింగ్.. ఎక్కడో తెలుసా

Rinku Singh has bought luxurious bungalow in Aligarh
షార్ట్స్‌లో చూడండి
టీమిండియా యంగ్ క్రికెటర్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ఏకంగా రూ.13 కోట్లకు రిటెయిన్ చేసుకున్న ఆటగాడు రింకూ సింగ్ ఓ విలాసవంతమైన బంగ్లాను కొనుగోలు చేశాడు. ఉత్తరప్రదేశ్‌లోని అలీఘఢ్ లో రూ.3.5 కోట్లు వెచ్చించి ఈ ఇంటిని కొన్నాడు. కుటుంబ సభ్యులతో కలిసి గృహప్రవేశం చేశాడు. 

గోల్డెన్ ఎస్టేట్‌ ఏరియాలో ఈ బంగ్లా ఉంది.  ఈ భవనం విస్తీర్ణం 500 చదరపు గజాలు అని జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.  కాగా గృహ ప్రవేశానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 

కాగా, ఐపీఎల్ 2023 సీజన్‌లో యశ్ దయాల్‌ బౌలింగ్‌లో ఒకే ఓవర్‌లో 5 సిక్సర్లు బాదడంతో రింకూ సింగ్‌కు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత పలు కీలకమైన ఇన్నింగ్స్ ఆడి పవర్ హిట్టర్‌గా నిరూపించుకున్నాడు. జాతీయ జట్టులో కూడా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న విషయం తెలిసిందే. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు రింకూ సింగ్ ఆడుతున్నాడు. ఇటీవల ఆ ఫ్రాంచైజీ ప్రకటించిన రిటెన్షన్ జాబితాలో రింకూ సింగ్ పేరు కూడా ఉంది.
Go Back to Shorts
Rinku Singh
Cricket
Sports News
Viral Videos

More Telugu News