YS Vijayamma: త‌ల్లికి కుమారుడు కాకుండా పోతాడా? కొడుక్కి అమ్మ‌కాకుండా పోతుందా?: వైఎస్ విజ‌య‌మ్మ‌

YS Vijayamma Video Message
షార్ట్స్‌లో చూడండి
"కుటుంబంలో భిన్నాభిప్రాయాలు స‌హ‌జ‌మే. అంత మాత్రాన ఆ త‌ల్లికి కుమారుడు కాకుండా పోతాడా? కొడుక్కి అమ్మ‌కాకుండా పోతుందా? ఓ అన్న‌కు చెల్లి కాకుండా పోతుందా? చెల్లికి అన్న‌కాకుండా పోతాడా?" అని వైఎస్ విజ‌య‌మ్మ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 

"మా పిల్ల‌ల్ని చాలా సంస్కార‌వంతంగా పెంచాం. మా కుటుంబంపై సోష‌ల్ మీడియాలో చేస్తున్న దుష్ప్ర‌చారం చాలా బాధ క‌లిగిస్తోంది. ష‌ర్మిల నా కూతురే కాదంటున్నారు. నా మ‌న‌వ‌ల ద‌గ్గ‌ర‌కు వెళితే అదో క‌థ‌. రెండేళ్ల క్రితం జ‌రిగిన నా కారు ప్ర‌మాదానికి నా కుమారుడు జ‌గ‌న్‌కు ముడిపెడుతున్నారు. మ‌మ్మ‌ల్ని అడ్డం పెట్టుకుని రాజ‌కీయ ల‌బ్ధి కోసం ఇంత‌గా దిగ‌జారుతారా?" అని విజ‌య‌మ్మ ప్ర‌శ్నించారు. ఈ మేర‌కు ఆమె మంగ‌ళ‌వారం వీడియో సందేశాన్ని విడుద‌ల చేశారు.

Go Back to Shorts
YS Vijayamma
YS Jagan
YS Sharmila
Andhra Pradesh

More Telugu News