ఈ నెల 11 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు... నోటిఫికేషన్ విడుదల
- అసెంబ్లీ, మండలి సమావేశాలకు నోటిఫికేషన్ జారీ చేసిన గవర్నర్
- ఈ సమావేశాల్లోనే బడ్జెట్ ప్రవేశపెట్టనున్న కూటమి ప్రభుత్వం
- పలు చట్ట సవరణ బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తాత్కాలిక ప్రాతిపదికన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ బడ్జెట్ కాలపరిమితి ఈ నెలాఖరుతో ముగియనుండగా, తాజా అసెంబ్లీ సమావేశాల్లో పూర్తి స్థాయి బడ్జెట్ తీసుకురానున్నారు.