AP TET: ఏపీ టెట్ ఫలితాల విడుదల.. అర్హత సాధించిన అభ్యర్థులకు లోకేశ్ శుభాకాంక్షలు

AP TET Results Announced Lokesh Best Wishes To Candidates Who Succeeded
  • టెట్ ఫలితాలను విడుదల చేసిన మంత్రి లోకేశ్
  • అక్టోబర్ 3 నుంచి 21 వరకు టెట్ 
  • 1,87,256 మంది అభ్యర్థుల ఉత్తీర్ణత
  • త్వరలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వేస్తామన్న లోకేశ్
ఏపీలో ఇటీవల నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (ఏపీ టెట్ 2024) ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. అక్టోబర్ 3 నుంచి 21 వరకు టెట్ నిర్వహించారు. తాజాగా ఈ ఫలితాలను మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. నిజానికి ఈ నెల 2నే ఫలితాలు విడుదల కావాల్సి ఉండగా తుది కీ వెల్లడిలో ఆలస్యం కారణంగా నేడు విడుదల చేశారు.

ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ ఎక్స్ ద్వారా స్పందించారు. రాష్ట్రంలోని యువత, నిరుద్యోగులకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం అడుగులు వేస్తోందని పేర్కొన్నారు. ఇందులో భాగంగా అక్టోబర్‌లో నిర్వహించిన టెట్ -2024 ఫలితాలను ఈరోజు విడుదల చేసినట్టు పేర్కొన్నారు. ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 3,68,661 మంది హాజరుకాగా, అందులో 1,87,256 ( 50.79 శాతం) మంది అర్హత సాధించినట్టు తెలిపారు. ఫలితాలను (https://cse.ap.gov.in) ద్వారా తెలుసుకోవచ్చన్నారు. నిరుద్యోగ టీచర్లకు ఇచ్చిన మాట ప్రకారం త్వరలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పారు. టెట్ లో అర్హత సాధించిన వారికి శుభాకాంక్షలు తెలిపారు.

    
      
AP TET
AP TET Results
Nara Lokesh

More Telugu News