UP boy: కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరిన బాలుడు.. పొట్టలో 56 వస్తువులు

Batteries blades among 56 objects removed from UP boys stomach
  • బ్లేడ్లు, మొలలు, బ్యాటరీలను వెలికి తీసిన వైద్యులు
  • ఆపరేషన్ చేసినా దక్కని బాలుడి ప్రాణాలు
  • ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ లో ఘటన
కడుపు నొప్పి, శ్వాస సంబంధిత సమస్యలతో ఆసుపత్రికి వచ్చిన బాలుడిని పరీక్షించిన వైద్యులు నివ్వెరపోయారు. స్కానింగ్ లో ఆ బాలుడి పొట్టలో పెద్ద సంఖ్యలో ఇనుప వస్తువులు కనిపించడమే దానికి కారణం. వెంటనే ఆపరేషన్ చేసి కడుపులోని వస్తువులన్నీ బయటకు తీశారు. అయితే, వైద్యులు ఎంతగా కృషి చేసినా ఆ బాలుడి ప్రాణాలను మాత్రం నిలబెట్టలేకపోయారు. ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ లో చోటుచేసుకుందీ ఘటన.

హత్రాస్ కు చెందిన పదిహేనేండ్ల బాలుడు ఆదిత్య స్థానిక పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. కొంతకాలంగా ఆ కుర్రాడు కడుపునొప్పితో బాధపడుతున్నాడు. రోజురోజుకూ నొప్పి తీవ్రం కావడంతో పాటు శ్వాస ఆడకపోవడంతో తల్లిదండ్రులు ఆదిత్యను ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు స్కానింగ్ చేసి చూడగా అతని పొట్టలో వివిధ వస్తువులు కనిపించాయి. వెంటనే ఆపరేషన్ చేసి కడుపులో నుంచి ఏకంగా 56 వస్తువులను వెలికి తీశారు.

వాటిలో బ్యాటరీలు, బ్లేడ్, మొలలు, గోర్లతో పాటు చిన్న చిన్న ఇనుప వస్తువులు ఉన్నాయి. ఇవన్నీ ఆదిత్య నోటితో మింగాడని వైద్యులు భావిస్తున్నారు. అయితే, ఆదిత్య గొంతుకు కానీ, ప్రేగులకు కానీ ఎలాంటి గాయం కాకపోవడంపై వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆదిత్యను కాపాడేందుకు తీవ్రంగా శ్రమించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయిందని వైద్యులు తెలిపారు. ఈ నెల 27 న ఢిల్లీలోని సప్ధర్ జంగ్ ఆసుపత్రిలో ఆదిత్యకు ఆపరేషన్ చేయగా.. ఆ మరుసటి రోజు ఆదిత్య చనిపోయాడని తల్లిదండ్రులు వివరించారు.
UP boy
56 objects
Batteries
blades
stomach

More Telugu News