Mahatma Gandhi: మహాత్మాగాంధీ విగ్రహం నోట్లో దీపావళి బాంబులు పెట్టి పేల్చిన ఆకతాయిలు.. వీడియో ఇదిగో!

Hooligans who put Diwali bombs in Mahatma Gandhis mouth and blew them up
  • హైదరాబాద్‌లోని బోయినపల్లిలో ఘటన
  • బాంబు పేలడంతో నల్లగా మారిన గాంధీ విగ్రహం
  • నలుగురు నిందితుల అరెస్ట్
కొందరు ఆకతాయిలు చెలరేగిపోయారు. మహాత్మాగాంధీ విగ్రహం నోట్లో దీపావళి బాంబులు పెట్టి పేల్చి హల్‌చల్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ప్రస్తుతం వారు కటకటాలు లెక్కపెట్టుకుంటున్నారు. 

హైదరాబాద్‌లోని బోయినపల్లి పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక బాపూజీ నగర్‌కు చెందిన 17 ఏళ్ల కుర్రాడు ముగ్గురు స్నేహితులతో కలిసి తన బంధువుల పెద్దకర్మ కార్యక్రమంలో పాల్గొన్నాడు. అక్కడ మద్యం తాగిన అనంతరం అందరూ కలిసి అక్కడున్న గాంధీ విగ్రహం వద్దకు చేరుకున్నారు. 

ఈ క్రమంలో విగ్రహం నోట్లో దీపావళి బాంబు పెట్టి కాల్చారు. అది పేలడంతో గాంధీ విగ్రహం నల్లగా మారింది. అది చూసి వారు వెకిలిగా నవ్వుతూ కనిపించారు. అనంతరం ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అది వైరల్ కావడంతో కొందరు స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వీడియో  ఆధారంగా నలుగురు నిందితులను గుర్తించి కటకటాల వెనక్కి పంపారు.
Mahatma Gandhi
Deepavali Crackers
Bowenpally
Hyderabad

More Telugu News