Sutthi Velu: ఆర్ధిక ఇబ్బందుల గురించి సుత్తివేలు వైఫ్ ఏమన్నారంటే!

Sutthi Velu FamilyInterview
  • సుత్తివేలుకి బ్రేక్ ఇచ్చిన 'త్రిశూలం'
  • ఆ సినిమా తరువాత బిజీ అయిన నటుడు
  • ఆయన మనసున్న మనిషన్న భార్య
  • నిద్రలోనే చనిపోయారని వెల్లడి  

సుత్తివేలు .. హాస్య నటుడిగా అనేక చిత్రాలు చేశారు. తనదైన డైలాగ్ డెలివరీ .. బాడీ లాంగ్వేజ్ తో ఆయన ప్రేక్షకులను నవ్వించడమే కాదు, ఏడిపించారు కూడా. అలాంటి సుత్తివేలు గురించి ఆయన శ్రీమతి 'సుమన్ టీవీ'తో మాట్లాడారు. " సుత్తివేలు గారు నాటకాలు బాగా వేసేవారు. ఆయనను సినిమాలకి పరిచయం చేసిన జంధ్యాల గారిని మేమంతా ఎప్పుడూ గుర్తుచేసుకుంటూనే ఉంటాము. 'త్రిశూలం' సినిమా తరువాత ఆయన ఇక వెనుదిరిగి చూసుకోలేదు" అని అన్నారు. 

"సుత్తివేలు గారికి ధైర్యం ఎక్కువగా ఉండేది .. అది ఆయన బలం. ఇక ఎవరు ఏం చెప్పినా నిజానిజాలు తెలుసుకోకుండా దానాలు చేయడం ఆయన బలహీనత. పిల్లలు సంపాదిస్తూ ఉన్నా, తాను సంపాదించిన డబ్బు మాత్రమే తాను ఖర్చు చేసేవారు. రాత్రి 12 గంటల వరకూ మాతో సరదాగా మాట్లాడారు. ఆ తరువాత నిద్రలోనే చనిపోయారు. అప్పటికి ఆయన వయసు 63 ఏళ్లు" అని అన్నారు. 

"సుత్తివేలు గారు ఆర్ధికంగా చాలా ఇబ్బందులు పడ్డారని చాలామంది రాశారు. యూట్యూబ్ లలోను చూశాను. కానీ అందులో ఎంతమాత్రం నిజం లేదు. అప్పటికీ ఆడపిల్లల పెళ్లిళ్లు అయిపోయాయి .. అబ్బాయి మంచి జాబ్ చేస్తున్నాడు .. సేవింగ్స్ ఉన్నాయి. చనిపోవడానికి ముందు వరకూ ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు. మరి ఎందుకిలా ప్రచారం చేస్తున్నారనేది అర్థం కావడం లేదు" అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. 

Sutthi Velu
Actor
Tollywood

More Telugu News