Nadendla Manohar: కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నాదెండ్ల

Nadendla Manohar visited Tirumala with his family
  • తిరుమల విచ్చేసిన మంత్రి నాదెండ్ల, కుటుంబ సభ్యులు
  • సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికిన టీటీడీ వర్గాలు
  • నాదెండ్లతో సెల్ఫీలకు పోటీలు పడిన అభిమానులు
రాష్ట్ర ఆహారం, పౌరసరఫరాలు, వినియోగదారుల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, ఆయన కుటుంబ సభ్యులు నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారులు మంత్రి నాదెండ్ల మనోహర్, ఆయన కుటుంబ సభ్యులకు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

ఇక, ఆలయం వెలుపల మంత్రి నాదెండ్ల మనోహర్ ను కలిసేందుకు అభిమానులు, జనసేన నాయకులు భారీగా తరలివచ్చారు. ఆయనతో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు పోటిపడ్డారు.
Nadendla Manohar
Tirumala
TTD
Janasena
TDP-JanaSena-BJP Alliance

More Telugu News