TET: రేపు టెట్ ఫలితాలు విడుదల చేయనున్న విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్

Education minister Nara Lokesh will release TET results tomorrow
  • అక్టోబరు 3 నుంచి 21 వరకు టెట్ నిర్వహించిన ఏపీ సర్కారు
  • 3.68 లక్షల మంది హాజరు
  • రేపు ఫలితాల విడుదలకు అన్ని ఏర్పాట్లు పూర్తి
ఏపీలో టెట్ (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రేపు (నవంబరు 4) టెట్ ఫలితాలను విడుదల చేయనున్నారు. 

త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించేందుకు కసరత్తులు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే టెట్ ఫలితాలు విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో గత నెల 3వ తేదీ నుంచి 21 వరకు ఆన్ లైన్ విధానంలో టెట్ నిర్వహించగా... 3.68 లక్షల మంది పరీక్షలకు హాజరయ్యారు. 

టెట్ ఫలితాల విడుదల వాస్తవానికి నవంబరు 2నే జరగాల్సి ఉండగా... నవంబరు 4కి వాయిదా వేశారు. మంత్రి నారా లోకేశ్ కూడా అమెరికా పర్యటన ముగించుకుని రావడంతో, రేపు ఆయన చేతుల మీదుగానే ఫలితాలు విడుదల చేయనున్నారు.
TET
Results
Nara Lokesh
DSC
TDP-JanaSena-BJP Alliance

More Telugu News