మెట్రో రైలు రెండో దశ నిర్మాణానికి పరిపాలన అనుమతులు జారీ
- హైదరాబాద్‌లో విస్తరించనున్న మెట్రో రవాణా సౌకర్యం
- రెండో దశలో 76.4 కిలోమీటర్ల మేర మెట్రో రైలు నిర్మాణం
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో మెట్రో రైలు రెండో దశ
మెట్రో రైలు రెండో దశ నిర్మాణానికి రాష్ట్ర వాటా రూ.7,313 కోట్లు కాగా, కేంద్రం వాటా రూ.4,230 కోట్లు. అలాగే, జికా, ఏడీబీ, ఎన్డీబీ నుంచి రూ.11,693 కోట్ల రుణాలు తీసుకోనుంది. మెట్రో రెండో దశ నిర్మాణంతో మెట్రో రైలు రవాణా సౌకర్యాలు మరింత విస్తరించనున్నాయి.