ఈదుపురంలో ఉచిత గ్యాస్ అందించి... స్టవ్ వెలిగించి... టీ తయారుచేసి తాగిన చంద్రబాబు
- శ్రీకాకుళం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
- ఈదుపురంలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ పథకానికి శ్రీకారం
- శాంతమ్మ అనే లబ్ధిదారుకు స్వయంగా ఫ్రీ సిలిండర్ అందించిన చంద్రబాబు
లబ్ధిదారు శాంతమ్మ ఇంటికెళ్లి స్వయంగా ఫ్రీ గ్యాస్ సిలిండర్ అందించారు. అంతేకాదు, ఉచిత సిలిండర్ ను బిగించి, స్టవ్ కూడా వెలిగించారు. చంద్రబాబు అంతటితో ఆగలేదు... తానే టీ తయారుచేసి తాగారు.
ఈదుపురం పర్యటన సందర్భంగా చంద్రబాబు ఇక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ఈ సభకు హాజరయ్యారు.