RBI: ఆర్బీఐ కొత్త నిబంధనలు ఇవిగో!

new rules of rbi will be implemented from today
షార్ట్స్‌లో చూడండి
నేటి నుంచి డొమెస్టిక్‌ మనీ ట్రాన్స్ ఫర్‌ (డీఎంటీ), క్రెడిట్‌ కార్డులలో మార్పులు, ఎల్‌పీజీ సిలిండర్‌ ధరలలో ఆర్బీఐ కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకురానుంది. తాజా నిబంధనలు ఏఏ వాటిపై అమలు చేయనుందంటే ..

దేశీయ నగదు బదిలీ (డీఎంటీ) నియమం
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) వినియోగదారుల భద్రతను మరింతగా మెరుగుపర్చడానికి కొత్త దేశీయ నగదు బదిలీ ఫ్రేమ్‌వర్క్‌ను ప్రకటించింది. ఇది నేటి నుండి అమలులోకి వస్తుంది. ఆర్బీఐ జూలై 2024 సర్క్యులర్‌లో..’బ్యాంకింగ్ అవుట్‌లెట్‌ల లభ్యత, ఫండ్ బదిలీల కోసం చెల్లింపు వ్యవస్థలలో పురోగతి.. కేవైసీ అవసరాలను తీర్చడం తదితర వాటిలో గణనీయమైన పెరుగుదల ఉంటుందని పేర్కొంది.

ఎస్బీఐ క్రెడిట్ కార్డ్‌లో కొత్త మార్పులు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుబంధ సంస్థ అయిన ఎస్బీఐ కార్డ్ కొత్త మార్పులను ప్రవేశపెట్టబోతోంది. దీని కింద అసురక్షిత ఎస్బీఐ క్రెడిట్ కార్డ్‌పై ఫైనాన్స్ ఛార్జీ నెలకు 3.75 శాతంకి పెరుగుతుంది. అదనంగా, బిల్లింగ్ వ్యవధిలో యూటిలిటీ చెల్లింపుల మొత్తం రూ.50,000 మించి ఉంటే ఒక శాతం ఛార్జీ విధించే అవకాశం ఉంటుంది. ఇది 2024 డిసెంబర్ 1 నుండి అమలులోకి రానుంది.

ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లలో కూడా కొత్త మార్పులు 
ఐసీఐసీఐ బ్యాంక్ దాని ఫీజు నిర్మాణం, క్రెడిట్ కార్డ్ రివార్డ్ ప్రోగ్రామ్‌లలో మార్పులు చేసింది. అందులో బీమా, కిరాణా షాపింగ్, ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్, ఇంధన సర్‌చార్జ్ వంటి వాటిలో మినహాయింపులు, ఆలస్యమైన చెల్లింపులకు  రుసుములు ప్రభావం చూపే అవకాశాలున్నాయి. అయితే ఇది ఈ నెల 15 నుంచి అమలులోకి వస్తుంది.

ఇండియన్ బ్యాంక్ ప్రత్యేక ఎఫ్‌డీ గడువు
ఇండియన్ బ్యాంక్ ప్రత్యేక ఫిక్సెడ్ డిపాజిట్‌లో పెట్టుబడిని 2024 నవంబర్ 30 వరకు మాత్రమే.. ఇదే చివరి తేదీ. ఇండ్ సూపర్ 300 రోజుల వడ్డీ రేట్లు సాధారణ ప్రజలకు 7.05శాతం, సీనియర్ సిటిజన్‌లకు 7.55శాతం, సూపర్ సీనియర్ సిటిజన్‌లకు 7.80 శాతం. ప్రత్యేకంగా 400 రోజుల పాటు, బ్యాంక్ సాధారణ ప్రజలకు 7.25 శాతం, సీనియర్ సిటిజన్‌లకు 7.75శాతం, సూపర్ సీనియర్ సిటిజన్‌లకు 8.00శాతం వడ్డీ రేట్లను కూడా అందిస్తుంది. 

అడ్వాన్స్ రైలు టిక్కెట్ బుకింగ్
అడ్వాన్స్ రైలు టిక్కెట్ బుకింగ్ కోసం ప్రస్తుత కాల పరిమితిని తగ్గిస్తున్నట్లు భారతీయ రైల్వే ఇప్పటికే ప్రకటించింది. దీంతో ప్రయాణీకులు ఇప్పుడు 60 రోజుల ముందుగానే టిక్కెట్లను బుక్ చేసుకోవాల్పి ఉంటుంది. ఈ ముందస్తు రిజర్వేషన్ వ్యవధి బయలు దేరే రోజు మినహాయింపు ఉంటుంది. ఇది 2024 నవంబర్ 1 నుండి అమల్లోకి వస్తుంది. అయితే ఇది ఇప్పటికే టికెట్లు బుక్‌ చేసుకున్న ప్రయాణీకులపై ప్రభావం పడదు. 

ట్రాయ్‌ కొత్త నియమం
స్పామ్, మోసాలను నిరోధించడానికి.. టెలికాం కంపెనీలు కొత్త నిబంధనల ప్రకారం మెసేజ్ ట్రేసబిలిటీని మొదలు పెట్టనున్నాయి. దీంతో పాటు లావాదేవీలు, ప్రచార సందేశాలు పర్యవేక్షించడం జరుగుతుంది.

ఎల్పీజీ సిలిండర్ ధర
నవంబర్ 1న ఎల్పీజీ సిలిండర్ ధరలు సవరించబడతాయి. ఇది దేశీయ వినియోగదారులు, వ్యాపారాలపై ప్రభావం పడుతుంది.  
Go Back to Shorts
RBI
New Rules
National News

More Telugu News