ఏపీ మంత్రి వాసంశెట్టికి త్రుటిలో తప్పిన ప్రమాదం
- మంత్రి వాసంశెట్టి సుభాశ్ హజరైన కార్యక్రమంలో ఒరిగిన వేదిక
- కాకినాడ జిల్లా రౌతులపూడి మండలంలో ఘటన
- మంత్రి పడిపోతుండగా పట్టుకున్న భద్రతా సిబ్బంది, అనుచరులు
ఏపీ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాశ్ కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం ఎన్ఎన్ పట్నం గ్రామంలో శెట్టిబలిజ సామాజికవర్గం వారు ఏర్పాటు చేసిన దొమ్మేటి వెంకటరెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో నేతలు ప్రసంగిస్తుండగా, వేదిక ఒక్కసారిగా ఒరిగింది. దీంతో మంత్రి సుభాశ్ కిందపడిపోబోతుండగా, భద్రతా సిబ్బంది, అనుచరులు ఆయనను పట్టుకోవడంతో ప్రమాదం తప్పింది. మంత్రి సుభాశ్ కు త్రుటిలో ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటనతో తర్వాత మరో వైదికపై నుంచి కార్యక్రమాన్ని కొనసాగించారు.