స్టీరింగ్ పట్టి ఆర్టీసీ బస్సు నడిపిన మంత్రి సవిత
- పెనుకొండ బస్టాండ్ లో నూతనంగా మంజూరైన ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన మంత్రి సవిత
- ఓ బస్సును స్వయంగా నడిపి చూసిన మంత్రి
- కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 400 బస్సులు కొనుగోలు చేసినట్లు వెల్లడి
అనంతరం మంత్రి సవిత మీడియాతో మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వం పదివేల కోట్లు అప్పు చేసినా మౌలిక వసతుల కల్పనకు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు. కొత్త బస్సులను గత ప్రభుత్వంలో కొనుగోలు చేయలేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 400 బస్సులు కొనుగోలు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఆర్ఎం మధుసూధన్, సిబ్బంది, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.