నవంబర్ 26న పార్లమెంట్ ఉభయసభల ప్రత్యేక సమావేశం
- రాజ్యాంగానికి ఆమోదం లభించి నవంబర్ 26 నాటికి 75 ఏళ్లు పూర్తి
- నాటి పార్లమెంట్ సెంట్రల్ హాలులోనే ఉభయ సభల సమావేశం
- ఇప్పటి వరకు చట్టాల్లో జరిగిన మార్పులు, చేర్పుల గురించి ప్రస్తావనకు వచ్చే అవకాశం
రాజ్యాంగానికి ఆమోదం లభించినప్పటి నుంచి ఇప్పటి వరకు వివిధ ఆర్టికల్స్, చట్టాల్లో జరిగిన మార్పులు, చేర్పుల గురించిన విషయాలు ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. గతంలో నవంబర్ 26ను జాతీయ న్యాయ దినోత్పవంగా నిర్వహించేవారు. అయితే 2015లో అంబేద్కర్ 125వ జయంతిని పురస్కరించుకొని ఆ రోజును రాజ్యాంగ దినోత్సవంగా మార్చారు.