Karnataka: కర్ణాటకలో షాకింగ్ ఘ‌ట‌న‌.. ట్రాఫిక్ పోలీస్‌ను కారు బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవ‌ర్‌!

SUV Driver Refuses To Stop Drags Cop On Bonnet In Karnataka
  • కర్ణాటక శివమొగ్గలో ఘటన
  • కారును అతివేగంగా డ్రైవింగ్ చేస్తున్న వ్య‌క్తిని ఆప‌మ‌ని అడిగిన‌ ట్రాఫిక్ పోలీస్
  • ఆపిన‌ట్టే ఆపి కారు బానెట్‌పై పోలీస్ అధికారిని ఈడ్చుకెళ్లిన డ్రైవ‌ర్‌ 
  • డ్రైవర్‌పై కేసు న‌మోదు చేసిన పోలీసులు
కర్ణాటకలోని శివమొగ్గలో షాకింగ్ ఘ‌ట‌న చోటుచేసుకుంది. విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీసును ఓ వ్య‌క్తి కారు బానెట్‌పై ఈడ్చుకెళ్లాడు. ఈ ఘ‌ట‌న తాలూకు వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతోంది. ఘ‌ట‌న వివ‌రాల్లోకి వెళితే.. ఎస్‌యూవీ నడుపుతున్న ఓ వ్యక్తి అతివేగంగా డ్రైవింగ్ చేస్తున్నందుకు ట్రాఫిక్ పోలీస్ ఆప‌మ‌ని అడిగాడు. కానీ, ఆపమని కోరుతున్న ట్రాఫిక్ అధికారిని ఢీకొట్టి కారు బానెట్‌పై పడేశాడా డ్రైవ‌ర్‌.

సహ్యాద్రి కళాశాల సమీపంలో సాధారణ వాహన తనిఖీ చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. వ్యక్తి కారు బానెట్ పైన ట్రాఫిక్ అధికారితో 100 మీటర్లకు పైగా ఈడ్చుకెళ్లిన‌ట్లు తెలుస్తోంది.

ఇలా అమానుషంగా ప్ర‌వ‌ర్తించిన వ్య‌క్తిని భద్రావతిలో కేబుల్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న మిథున్ జగదలేగా పోలీసులు గుర్తించారు. అతనిపై కేసు నమోదు చేసినట్లు శివమొగ్గ పోలీసు సూపరింటెండెంట్ వెల్ల‌డించారు.

గతేడాది డిసెంబరులో కూడా బెంగుళూరులో ఇదే త‌ర‌హా సంఘటన జరిగింది. రోడ్డుపై రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేస్తున్నందుకు ఆపడానికి ప్రయత్నించిన ట్రాఫిక్ పోలీసుపై ఆటో డ్రైవర్ వాహ‌నం ఎక్కించ‌డానికి ప్రయత్నించాడు.
Karnataka
SUV
Bonnet
Traffic Police

More Telugu News