Love Reddy: 'లవ్ రెడ్డి' నటుడిపై ప్రేక్షకురాలి దాడి... వైరల్‌ అవుతున్న వీడియో

Love Reddy actor is attacked by a spectator the video is going viral
  • థియేటర్స్‌ విజిట్ చేస్తోన్న లవ్‌రెడ్డి టీమ్‌కు చేదు అనుభవం 
  •  నటుడు రామస్వామిపై దాడి చేసిన ప్రేక్షకురాలు 
  •  మహిళకు నచ్చజెప్పిన చిత్రబృందం
అంజన్‌ రామచంద్ర, శ్రావణి జంటగా నటించిన చిత్రం 'లవ్‌రెడ్డి'. ఇటీవల ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. గురువారం ఈ చిత్రబృందం హైదరాబాద్‌ నగరంలోని థియేటర్ల విజిట్‌ను నిర్వహించింది. ఇందులో భాగంగా నిజాంపేట జీపీఆర్ మల్టీప్లెక్స్‌ థియేటర్‌కు వెళ్లిన లవ్‌రెడ్డి చిత్రబృందానికి ఓ చేదు అనుభవం ఎదురైంది. 'లవ్ రెడ్డి' చిత్రబృందంలోని నటుడిపై ఓ ప్రేక్షకురాలు దాడికి పాల్పడింది. 

ఈ సినిమా క్లైమాక్స్ చూసి ఎమోషనల్ అయిన ఆ ప్రేక్షకురాలు ఈ  చిత్రంలో తండ్రి పాత్రను పోషించిన ఎన్ టీ రామస్వామి అనే నటుడు నిజంగానే ఆ ప్రేమజంటను విడదీశాడని అనుకుని కోపంతో తిడుతూ దాడి చేసింది. 

ఈ ఘటనతో ఆశ్చర్యపోయిన హీరో అంజన్ రామచంద్ర, హీరోయిన్ శ్రావణి, దర్శకుడు స్మరణ్ రెడ్డి, ఇతర టీమ్ మెంబర్స్ ఆ మహిళను అడ్డుకుని ఆమెకు నచ్చజెప్పారు. ఇది కేవలం సినిమా మాత్రమేనని ఆమెకు తెలియజేశారు. ఎన్ టీ రామస్వామి తండ్రి పాత్రలో నటించాడని, అతను సినిమాలో చూపించినట్లు చెడ్డవాడు కాదంటూ మహిళకు చెప్పి అక్కడి నుంచి పంపించివేశారు. 


Love Reddy
anjanramchendra
Love reddy news
Love reddy press meet

More Telugu News