Pawan Kalyan: రాష్ట్రానికి ఈ రైల్వే లైన్ ఎంతో అవసరం: పవన్ కల్యాణ్

Pawan Kalyan thanked Centre for granting Amaravati railway line
  • అమరావతి రైల్వే లైన్ కు కేంద్రం ఆమోదం
  • హర్షం వ్యక్తం చేసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
  • ఏపీ ఆర్థిక వ్యవస్థకు ఎంతో ఊతమిస్తుందని వెల్లడి 
మొత్తం 57 కిలోమీటర్ల మేర... రూ.2,245 కోట్ల వ్యయంతో అమరావతి అనుసంధాన రైల్వే ప్రాజెక్టుకు కేంద్రం పచ్చజెండా ఊపడంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రాభివృద్ధి కోణంలోంచి చూస్తే అమరావతి రైల్వే లైన్ ఎంతో అవసరం అని అన్నారు. 

అమరావతి రైల్వే కనెక్టివిటీ లైన్ కేటాయించినందుకు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని వెల్లడించారు. ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి నాలుగేళ్ల సమయం పడుతుందని అన్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా కృష్ణా నదిపై 3.2 కిలోమీటర్ల మేర బ్రిడ్జి కూడా నిర్మాణం జరుపుకుంటుందని, ఈ కొత్త రైల్వే లైన్ పూర్తయితే అమరావతికి దేశంలోని అన్ని ప్రధాన నగరాలతో కనెక్టివిటీ ఏర్పడుతుందని పవన్ కల్యాణ్ వివరించారు. 

ఇది ఏపీ ఆర్థిక వ్యవస్థకు ఎంతో ఊతమిస్తుందని పేర్కొన్నారు. మచిలీపట్నం-కృష్ణపట్నం-కాకినాడ పోర్టులను కూడా అనుసంధానం చేసేలా ఈ ప్రాజెక్టు తీసుకురావడం హర్షణీయమని అన్నారు.
Pawan Kalyan
Railway Line
Amaravati
TDP-JanaSena-BJP Alliance
Andhra Pradesh

More Telugu News