జొమాటో ఆర్డర్లు మరింత ప్రియం.. పండగ సీజన్ ముందు కీలక నిర్ణయం
- ప్లాట్‌ఫామ్ ఫీజు 60 శాతం మేర పెంపు
- రూ.6 నుంచి రూ.10కి పెరుగుదల
- పండగ సీజన్ ముందు జొమాటో కీలక నిర్ణయం
కాగా జొమాటో ప్లాట్‌ఫామ్ ఫీజు క్రమక్రమంగా పెరుగుతోంది. క్రమం తప్పకుండా అనేక సార్లు కంపెనీ పెంచింది. ఆరంభంలో రూ.1గా ఉండగా దానిని రూ.2కి, ఆపై రూ.3కి పెంచింది. 2023లో రూ.3 నుంచి రూ. 4కి పెంచింది. ఆ తర్వాత క్రమంగా రూ. 6కి పెరిగింది. దీపావళి నేపథ్యంలో పండగ సీజన్‌ను క్యాష్ చేసుకునేందుకు కంపెనీ తాజాగా రూ.10కి పెంచింది.
పండగల సీజన్‌లో జొమాటో ఆర్డర్లకు సాధారణంగా డిమాండ్ అధికంగా ఉంటుంది. నిర్వహణ వ్యయాల కోసం ప్లాట్‌ఫామ్ ఫీజులను పెంచాల్సిన అవసరం ఏర్పడిందని జొమాటో తెలిపింది. దీపావళి సందర్భంగా ఆర్డర్‌ల సంఖ్య పెరుగుతుందని, వినియోగదారులకు చక్కటి సేవలను అందించడానికి పెంచిన ఈ రుసుము సహాయపడుతుందని కంపెనీ పేర్కొంది. కాగా జొమాటో ప్రత్యర్థి ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ కూడా ప్లాట్‌ఫారమ్ ఫీజు వసూలు చేస్తోంది. ప్రతి ఆర్డర్‌పై రూ.6.50 చొప్పున ఛార్జీలు వసూలు చేస్తోంది.