Rajnath Singh: అణుశక్తి సామర్థ్యం ఉన్న నాలుగవ జలాంతర్గామిని ఆవిష్కరించిన భారత్

Defence Minister Rajnath Singh launched Indias fourth nuclear powered ballistic missile submarine S4
  • అక్టోబర్ 16న విశాఖపట్నంలో ప్రారంభించిన రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్
  • జలాంతర్గామిలో 75 శాతం దేశీయంగా తయారీ
  • నావికాదళం సామర్థ్యం పెంపులో భాగంగా సిద్ధం
నావికాదళాన్ని మరింత బలోపేతం చేస్తూ అణుశక్తి సామర్థ్యం ఉన్న నాలుగవ బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గామిని కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ ప్రారంభించారు. విశాఖపట్నంలోని షిప్ బిల్డింగ్ సెంటర్‌లో (ఎస్‌బీసీ) అక్టోబరు 16న  జలాంతర్గామిని ఆయన ఆవిష్కరించారు.

నావికాదళంలో జలాంతర్గాముల సంఖ్య పెంపునకు రక్షణశాఖ తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఈ అధునాతన జలాంతర్గామి అందుబాటులోకి వచ్చింది. ఈ జలాంతర్గామిలో 75 శాతం దేశీయంగా తయారైంది. ప్రస్తుతానికి దీనికి ఎస్4* (S4*) అని పేరు పెట్టారు. అణు జలాంతర్గామి నౌకాదళాన్ని బలపరచడం ద్వారా ప్రత్యర్థులకు మన సత్తా చాటిచెప్పడంతో పాటు సుధీర్ఘ తీర ప్రాంతానికి భద్రతను అందించవచ్చని రక్షణరంగ నిపుణులు చెబుతున్నారు.

ఇక అణుశక్తితో నడిచే మూడవ జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిధామాన్‌ తయారీ ప్రక్రియ ఇప్పటికే కొనసాగుతోంది. వచ్చే ఏడాది ఇది అందుబాటులోకి రానుంది. మరో రెండు అణు జలాంతర్గాములు ఐఎన్ఎస్ అరిహంత్, ఐఎన్ఎస్ అర్ఘత్ ఇప్పటికే భారత నౌకాదళంలో చేరాయి. ఐఎన్‌ఎస్ అరిఘాట్‌ను ఈ ఏడాది ఆగస్టులో ఆవిష్కరించారు. 

ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చోటు చేసుకుంటున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకొని అణుశక్తితో నడిచే రెండు ఎటాక్ సబ్‌మెరైన్లను తయారు చేయడానికి కేబినెట్ కమిటీ ఆఫ్ సెక్యూరిటీస్ (సీసీఎస్) అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా ఆధునిక ప్రపంచంలో ఎటు ఎలాంటి అనూహ్యమైన ప్రతికూల పరిస్థితి ఎదురైనా ధీటుగా ఎదుర్కొనేందుకు ఆయుధ సంపత్తిని బలోపేతం చేయడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందుకోసం నిరంతర ప్రయత్నాలను కొనసాగిస్తోంది.
Rajnath Singh
Nuclear Submarine
Visakhapatnam
submarine S4

More Telugu News