TDP Office Attack: టీడీపీ కార్యాలయంపై దాడి కేసు ప్రధాన నిందితుడు చైతన్యకు 14 రోజుల రిమాండ్

Court remands TDP Office attack accused Panuganti Chaitanya
  • గతంలో టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి
  • ఇప్పటికే విచారణ ఎదుర్కొంటున్న పలువురు వైసీపీ నేతలు
  • నేడు కోర్టులో లొంగిపోయిన వైసీపీ విద్యార్థి విభాగం నేత
  • చైతన్యకు ఈ నెల 28 వరకు రిమాండ్ విధించిన మంగళగిరి కోర్టు
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ప్రధాన నిందితుడు పానుగంటి చైతన్య ఇవాళ కోర్టులో లొంగిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, కోర్టు చైతన్యకు 14 రోజుల రిమాండ్ విధించింది. మంగళగిరి కోర్టు ఈ నెల 28 వరకు రిమాండ్ విధించింది.

చైతన్య లొంగిపోయిన నేపథ్యంలో, టీడీపీ ఆఫీసుపై దాడి కేసు దర్యాప్తు వేగవంతం కానుంది. ఇప్పటికే ఈ కేసులో లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, దేవినేని అవినాశ్ వంటి వైసీపీ నేతలను పోలీసులు ప్రశ్నిస్తున్నప్పటికీ, వారి నుంచి సరైన సమాచారం రావడంలేదని తెలుస్తోంది. ఇప్పుడు చైతన్యను ప్రశ్నించనున్న పోలీసులు, అతడి నుంచి సేకరించే సమాచారం ఆధారంగా, మిగతా నిందితుల నుంచి కీలక సమాచారం రాబట్టేందుకు అవకాశం ఏర్పడింది.

TDP Office Attack
Panuganti Chaitanya
Remand
Mangalagiri Court
YSRCP

More Telugu News