కాదంబరీ జత్వానీ కేసులో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం
- నటి కాదంబరీ జత్వానీ కేసు దర్యాప్తును సీఐడీకి అప్పగిస్తూ డీజీపీ ఆదేశాలు
- కేసులకు సంబంధించి అన్ని రికార్డులను సీఐడీకి అప్పగించాలని విజయవాడ పోలీసులకు ఆదేశాలు
- సస్పెన్షన్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు అధికారులు
దీంతో ఈ కేసులకు సంబంధించి అన్ని రికార్డులను సీఐడీకి అప్పగించాలంటూ డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే జత్వాని ఫిర్యాదు మేరకు నాటి పోలీస్ ఉన్నతాధికారులపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ లు సీతారామాంజనేయులు, కాంతి రాణా, విశాల్ గున్నీ, ఏసీపీ హనుమంతరావు, సీఐ సత్యనారాయణలను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. జత్వాని కేసులో ఇప్పటికే వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ ను పోలీసులు అరెస్టు చేశారు.