Valmiki Jayanthi: యువగళంలో ఇచ్చిన మరో హామీని ప్రభుత్వం నెరవేర్చింది: మంత్రి నారా లోకేశ్

Nara Lokesh says alliance govt fulfilled another assurance as given
  • వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని విజ్ఞప్తులు వచ్చాయన్న లోకేశ్
  • బోయ, వాల్మీకి సామాజిక వర్గీయులు తనను కోరారని వెల్లడి
  • ఈ నెల 17న అన్ని జిల్లాల్లో వాల్మీకి జయంతి వేడుకలు
  • ఆ మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయన్న లోకేశ్
ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం తమ బాధ్యత అని ఏపీ విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. యువగళంలో ఇచ్చిన మరో హామీని ప్రభుత్వం నెరవేర్చిందని వెల్లడించారు. 

వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ప్రజలు కోరారని, ఆ మేరకు బోయ, వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన వారు పాదయాత్రలో తనకు విజ్ఞప్తి చేశారని వివరించారు. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ఈ నెల 17న అన్ని జిల్లాల్లో వాల్మీకి జయంతిని నిర్వహించాలని ఉత్తర్వులు వెలువడ్డాయని లోకేశ్ తెలిపారు. 

అనంతపురంలో రాష్ట్రస్థాయి వాల్మీకి జయంతి వేడుకలు నిర్వహిస్తామని వెల్లడించారు. బీసీల ఆత్మగౌరవాన్ని పెంచే దిశగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తోందని స్పష్టం చేశారు.
Valmiki Jayanthi
Nara Lokesh
Assurance
TDP-JanaSena-BJP Alliance
Yuva Galam Padayatra

More Telugu News