Chiranjeevi: దసరా రోజు మెగా ట్రీట్... రేపు చిరంజీవి 'విశ్వంభర' టీజర్ విడుదల

Chiranjeevi starring Vishwambhara teaser will be out tomorrow
  • చిరంజీవి కథానాయకుడిగా విశ్వంభర
  • యువ దర్శకుడు వశిష్ట డైరెక్షన్ లో చిత్రం
  • రేపు ఉదయం 10.49 గంటలకు టీజర్ 
మెగాస్టార్ చిరంజీవి హీరోగా యువ దర్శకుడు వశిష్ట డైరెక్షన్ లో రూపుదిద్దుకుంటున్న చిత్రం విశ్వంభర. ఈ చిత్ర బృందం నేడు కీలక అప్ డేట్ ఇచ్చింది. రేపు దసరా (అక్టోబరు 12) సందర్భంగా విశ్వంభర చిత్రం నుంచి టీజర్ రిలీజ్ చేయనున్నారు. ఉదయం 10.49 గంటలకు టీజర్ విడుదల కానుందని దర్శకుడు వశిష్ట సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. 

విశ్వంభర చిత్రంలో చిరంజీవి సరసన త్రిష కథానాయికగా నటిస్తోంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. 

కాగా, ఈ చిత్రం మ్యూజిక్ సిట్టింగ్ కు చిరంజీవి కూడా హాజరవడం తెలిసిందే. చిరు తనకు బాగా నచ్చిన బాణీలను ఎంపిక చేసుకుని సాంగ్స్ చేయించుకుంటున్నారు. గతంలో చిరంజీవి-కీరవాణి కాంబోలో వచ్చిన ఘరానా మొగుడు ఎంత పెద్ద మ్యూజికల్ హిట్టో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
Chiranjeevi
Vishvambhara
Teaser
Vashishta
UV Creations

More Telugu News