రతన్ టాటా పార్థివదేహం వద్ద బాధతో పెంపుడు శునకం 'గోవా'... వీడియో ఇదిగో
- నిన్న అర్ధరాత్రి కన్నుమూసిన రతన్ టాటా
- అందరినీ కదిలించిన శునకం ఆవేదన
- పెంపుడు శునకంతో రతన్ టాటాకు మంచి అనుబంధం
రతన్ టాటాకు తన పెంపుడు శునకం గోవాతో మంచి అనుబంధం ఉంది. రతన్ టాటా ఓసారి గోవా వెళ్లారు. అక్కడ ఆయన వెంట ఓ శునకం నడుస్తూ వచ్చింది. దానిని చూసి ముచ్చటపడిన రతన్ టాటా ఆ శునకాన్ని దత్తత తీసుకున్నారు. దానికి గోవా అని పేరు పెట్టారు. ఈ శునకం పదకొండేళ్లుగా రతన్ టాటాతోనే ఉంటోంది.