మరోసారి విదేశీ పర్యటనకు ప్రధాని మోదీ
- రెండు రోజుల పర్యటన నిమిత్తం రేపు లావోస్ వెళుతున్న ప్రధాని మోదీ
- లాహోస్ అధ్యక్షతన 21వ ఆసియాన్ - ఇండియన్ సమ్మిట్
- సదస్సుల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ
ఈ సమావేశాల్లో వివిధ దేశాలతో భారత్ భాగస్వామ్య ప్రాంతీయ ప్రాముఖ్యం కలిగిన అంశాలపై చర్చించే అవకాశం ఉందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ శిఖరాగ్ర సమావేశాల్లో భాగంగా మోదీ ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక విషయాలకు సంబంధించిన సమావేశాల్లో కూడా పాల్గొననున్నారని తెలుస్తోంది. భారతదేశంలో యాక్ట్ ఈస్ట్ పాలసీ వచ్చి దశాబ్దకాలం అవుతోంది. ఈ పాలసీ ఇండో - పసిఫిక్ అభివృద్ధికి కీలక స్తంభం వంటిది అని విదేశాంగ శాఖ పేర్కొంది.
కాగా, ప్రధాని మోదీ ...రష్యా - ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఇరు దేశాలను సందర్శించి .. యుద్ధం ముగింపు విషయంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. అనంతరం మోదీ ఇటలీ, అమెరికా దేశాల్లో పర్యటించారు. మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు ప్రస్తుతం భారత్ పర్యటనలో ఉన్నారు. ఈ క్రమంలో భాగంగా ద్వైపాక్షిక సంబంధాలపై ప్రధాని మోదీతో విస్తృత స్థాయిలో ఆయన చర్చలు జరిపారు.