ప్రీ వెడ్డింగ్ షూట్ పేరుతో ఇవేం పనులు.. లిమిట్ క్రాస్ అయ్యారంటూ నెటిజన్ల ఫైర్.. వీడియో ఇదిగో!

Pre Wedding Shoot Cross Limits Here Is Viral Video
  • ప్రీ వెడ్డింగ్ షూట్ పేరుతో వెర్రితలలు
  • షూట్‌లో అధర చుంబనంలో మునిగిపోయిన జంట
  • ఇది సెమీ పోర్న్ తప్ప మరోటి కాదంటూ నెటిజన్ల మండిపాటు
  • సంస్కృతి, సంప్రదాయాలను నాశనం చేస్తున్నారంటూ ఆగ్రహం
ప్రీ వెడ్డింగ్ షూట్ పేరుతో యువత వెర్రి తలలు వేస్తోందని చెప్పేందుకు ఇది మంచి ఉదాహరణ. పెళ్లికి ముందే కాబోయే జంట ఒకరికి ఒకరు దగ్గరయ్యేందుకు చేసే ఈ ప్రయత్నం ఇటీవల విపరీత పోకడలకు పోతోంది. ప్రీ వెడ్డింగ్ షూట్‌ను నవ్వులపాలు చేస్తోంది. తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవతున్న ఒక ప్రీ వెడ్డింగ్ షూట్ వీడియో సంప్రదాయవాదులు, నెటిజన్ల ఆగ్రహానికి గురైంది. పవిత్ర సంస్కృతిని సర్వనాశనం చేసి పారేస్తున్నారని సంప్రదాయవాదులు, సమాజానికి ఎలాంటి సందేశం ఇస్తున్నారని నెటిజన్లు కడిగిపారేస్తున్నారు. కాగా, ఈ వీడియో ఇప్పటికే 1.4 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది. ఇక, కామెంట్లకు అయితే లెక్కే లేదు.

ఈ వీడియోలోని జంట అధర చుంబనాల్లో మునిగిపోవడమే వీరి ఆగ్రహానికి కారణం. అది కూడా క్షణకాలం కనిపించడం కాదు.. 21 సెకన్ల నిడివి వున్నఈ వీడియోలో నాలుగైదుసార్లు వారు తమకంతో అలా చుంబించుకోవడం కనిపించింది. సనాతన భారతీయ సంస్కృతిపై ఇలాంటి ప్రీ వెడ్డింగ్ షూట్లు తీవ్ర ప్రభావం చూపుతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. మరీ ముఖ్యంగా చిన్నారులపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది సరికాదని, ఇకనైనా తల్లిదండ్రులు తమ పిల్లలకు భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి విడమరిచి చెప్పాలని కోరుతున్నారు. అసలు ఇలాంటి లిప్‌లాక్ షూట్‌కు అనుమతించిన తల్లిదండ్రులను అనాలని మరికొందరు మండిపడుతున్నారు. ప్రీ వెడ్డింగ్ షూట్ పేరుతో సెమీ పోర్న్ చూపిస్తున్నారని మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Go Back to Shorts
Pre Wedding Shoot
Wedding
Viral Video
Indian Culture

More Telugu News