13,444 కోట్లు నష్టపోయిన ముకేశ్ అంబానీ.. 100 బిలియన్ల క్లబ్ నుంచి అదానీ ఔట్!
- పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు
- యుద్ధ భయాల నేపథ్యంలో మార్కెట్ల పతనం
- రూ. 1700 కోట్లు నష్టపోయిన ఇన్వెస్టర్లు
- రూ. 7,915 కోట్లకు పైగా నష్టపోయిన అదానీ
‘బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ ఇండెక్స్’ ప్రకారం ఈ ఏడాది రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ రూ. 13,444 కోట్లకుపైగా నష్టపోయారు. అదే సమయంలో గౌతం అదానీ రూ. 7,915 కోట్లకుపైగా నష్టాన్ని చవిచూశారు. ఈ పతనంతో ముకేశ్ అంబానీ నికర విలువ 162 బిలియన్ డాలర్ల నుంచి 105 బిలియన్ డాలర్లకు పడిపోయింది. అయినప్పటికీ ప్రపంచంలోని అత్యంత సంపన్న వ్యక్తుల్లో 14వ స్థానంలో ఉన్నారు. మరోవైపు గౌతం అదానీ నికర విలువ 94.2 బిలియన్ డాలర్లకు పడిపోవడంతో ఈ జాబితాలో 18 స్థానానికి దిగజారారు. దీంతో 100 బిలియన్ల క్లబ్ నుంచి ఆయన బయటకు వచ్చారు.