ముంబైలో ఎన్సీపీ నేత హత్య
- పదునైన ఆయుధంతో పొడిచి చంపిన దుండగులు
- శుక్రవారం అర్ధరాత్రి బైకుల్లా ప్రాంతంలో ఘటన
- ఆసుపత్రికి తరలించేలోపే చనిపోయారన్న పోలీసులు
ముంబైలోని బైకుల్లా ప్రాంతంలో శుక్రవారం అర్ధరాత్రి ఈ హత్య జరిగింది. సచిన్ కుర్మీ ప్రస్తుతం ఎన్సీపీ బైకుల్లా అధ్యక్షుడిగా ఉన్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. ఆయన హత్యపై తీవ్రంగా మండిపడుతున్నారు. హంతకులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. సచిన్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. హంతకులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఘటనా స్థలానికి సమీపంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. కాగా, సచిన్ కుర్మీ హత్యను ఎన్సీపీ ముంబై అధ్యక్షుడు సమీర్ భుజ్ బల్ తీవ్రంగా ఖండించారు. సచిన్ మృతిపై విచారం వ్యక్తం చేస్తూ ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.