భార్యాభర్తల వివాదం కేసు... ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సీజేఐ

భార్యాభర్తల వివాదం కేసు... ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సీజేఐ

Chief Justice Consent Divorce Advice To Woman
  • కేసును సాగదీస్తే న్యాయవాదులకే ప్రయోజనమని వ్యాఖ్య
  • పరస్పర సమ్మతితో విడాకులకు అంగీకరించాలని సూచన
  • తమ భార్యభర్తల కేసును మరో కోర్టుకు బదిలీ చేయాలని మహిళ పిటిషన్
  • ఈ కేసు విచారణ సందర్భంగా సీజేఐ వ్యాఖ్యలు
ఓ దంపతులకు సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైవాహిక బంధంలో వివాదాల వ్యవహారంలో సుదీర్ఘ న్యాయపోరాటం వల్ల న్యాయవాదులకే ప్రయోజనం కలుగుతుందని, కాబట్టి దంపతులు అవసరమైతే పరస్పర సమ్మతితో విడాకులకు అంగీకరించాలని ఓ జంటకు సూచించారు.

తమ భార్యాభర్తల కేసును మరో కోర్టుకు బదిలీ చేయాలని ఓ కేసులో మహిళ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. విచారణ సందర్భంగా మహిళ ఏం చేస్తుందో సీజేఐ చంద్రచూడ్ అడిగి తెలుసుకున్నారు.

తాను ఎంటెక్ పూర్తి చేశానని, అమెరికా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పొందినట్లు కోర్టుకు తెలిపింది. ప్రస్తుతం తాను ఉద్యోగం ఏమీ చేయడం లేదని కూడా వెల్లడించింది.

మీరు మంచి విద్యావంతులు, కాబట్టి మొదట ఉద్యోగం సంపాదించుకోవాలని సూచించారు. అదే సమయంలో ఈ కేసులో మీరు పదేళ్లైనా న్యాయ పోరాటం చేయగలరేమో కానీ అలా చేయడం వల్ల న్యాయవాదులకు మాత్రమే ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. కాబట్టి పరస్పర సమ్మతితో విడాకులు తీసుకోవడానికి ఎందుకు అంగీకరించకూడదు? అందుకు మీరు సిద్ధపడితే మాత్రం కేసును క్లోజ్ చేస్తామన్నారు.
Advertisement
Supreme Court
CJI Chandrachud
India

More Telugu News