విశాఖలో గంజాయి చాక్లెట్ల స్వాధీనం
- విశాఖలో కలకలం రేపిన గంజాయి చాక్లెట్ ల విక్రయం
- గంజాయి చాక్లెట్ లను స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు
- 660 గ్రాముల 133 గంజాయి చాక్లెట్ల స్వాధీనం
విశాఖ టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో టాస్క్ ఫోర్స్ పోలీసులు క్రాంతి థియేటర్ ఎదురుగా ఉన్న పాన్ షాపులో తనిఖీ చేసి, 660 గ్రాముల 133 గంజాయి చాక్లెట్ లు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న మనోజ్ కుమార్ చౌదరిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.