కన్నతల్లిని చెట్టుకు కట్టేసి, సజీవ దహనం చేసిన కొడుకులు
- కన్నతల్లి పట్ల ఇద్దరు కొడుకుల కర్కశత్వం
- త్రిపురలో వెలుగుచూసిన అమానుష ఘటన
- కుటుంబ కలహాలే కారణమంటున్న పోలీసులు
ఒక మహిళను కాల్చివేశారనే సమాచారం అందిన వెంటనే పోలీసు బృందం అక్కడికి వెళ్లిందని, చెట్టుకు కట్టేసి కాల్చిన మృతదేహాన్ని గుర్తించామని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి తరలించామని జిరానియా సబ్-డివిజనల్ పోలీసు అధికారి కమల్ పేర్కొన్నారు. నిందితులను కోర్టులో హాజరు పరచనున్నామని చెప్పారు. విచారణలో మరిన్ని వివరాలు తెలుస్తాయని అన్నారు.