Nabil Kaouk: కొనసాగుతున్న ఇజ్రాయెల్ వేట... హిజ్బొల్లా డిప్యూటీ హెడ్ కూడా హతం

Israel kills Hezbollaha deputy Nabil Kaouk in deadly strikes
  • పశ్చిమాసియాలో భీకర పోరు
  • మిలిటెంట్ సంస్థల అగ్రనేతలను టార్గెట్ చేస్తున్న ఇజ్రాయెల్
  • ఇప్పటికే హిజ్బొల్లా చీఫ్ నస్రల్లా హతం
  • తాజాగా రాకెట్ దాడుల్లో హిజ్బొల్లా అగ్రశ్రేణి కమాండర్ నబిల్ మృతి
హమాస్, హిజ్బొల్లా మిలిటెంట్ సంస్థలను నామరూపాల్లేకుండా చేయాలని ఇజ్రాయెల్ కంకణం కట్టుకుంది. ఇప్పటికే హిజ్బొల్లా చీఫ్ సయ్యద్ హసన్ నస్రల్లాను హతమార్చిన ఇజ్రాయెల్... లెబనాన్ భూభాగంలో ఇవాళ జరిపిన దాడుల్లో హిజ్బొల్లా డిప్యూటీ హెడ్ నబిల్ కౌక్ ను అంతమొందించింది. నబిల్ కౌక్ ను రాకెట్ దాడులతో మట్టుబెట్టినట్టు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. 

అయితే, కౌక్ మృతి పట్ల హిజ్బొల్లా నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. సోషల్ మీడియాలో మాత్రం అతడి మృతికి సంతాప ప్రకటనలు వెలువడుతున్నాయి. 

హిజ్బొల్లా అగ్రశ్రేణి కమాండర్లలో ఒకడిగా ఉన్న నబిల్ కౌక్ ను అమెరికా కూడా నిషిద్ధ జాబితాలో చేర్చింది. నాలుగేళ్ల కిందట అతడిపై పలు ఆంక్షలు విధించింది.
Nabil Kaouk
Hezbollah
Israel
Lebanon

More Telugu News