Kanpur Test: కాన్పూర్ టెస్ట్: వాన దెబ్బకు మూడో రోజు ఆట కూడా రద్దు

Day 3 of second test between Team India and Bangladesh called of due to rain
  • కాన్పూర్ లో టీమిండియా × బంగ్లాదేశ్ రెండో టెస్టు
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
  • 3 వికెట్లకు 107 పరుగులు చేసిన బంగ్లాదేశ్
  • తొలి రోజే వర్షం కారణంగా నిలిచిన ఆట 
  • ఇప్పటిదాకా ఆట మళ్లీ మొదలు కాని వైనం
టీమిండియా, బంగ్లాదేశ్ జట్ల మధ్య కాన్పూర్ లో జరుగుతున్న మూడో టెస్టుకు వరుణుడు అడ్డంకిగా మారాడు. తొలి రోజు ఆట నుంచే ప్రభావం చూపిస్తున్న వర్షం... నిన్న రెండో రోజు ఆటను పూర్తిగా తుడిచిపెట్టేసింది. ఇవాళ కూడా ఇక్కడి గ్రీన్ పార్క్ స్టేడియం వర్షంతో తడిసి ముద్దవడంతో మూడో రోజు ఆట సైతం ఒక్క బంతి పడకుండానే రద్దయింది. 

ఈ మ్యాచ్ లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. బంగ్లాదేశ్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో 3 వికెట్లకు 107 పరుగులతో ఆడుతున్నప్పుడు నిలిచిపోయిన ఆట... మళ్లీ మొదలుకాలేదు. ఇవాళ మధ్యాహ్నం కూడా మైదానాన్ని పరిశీలించిన అంపైర్లు... ఆట కొనసాగించడం సాధ్యం కాదని తేల్చేశారు.
Kanpur Test
Day 3
Rain
Team India
Bangladesh

More Telugu News