NASA-SpaceX Mission: సునీతా విలియమ్స్‌ను తీసుకొచ్చేందుకు ఐఎస్ఎస్‌కు బయలుదేరిన నాసా-స్పేస్‌ఎక్స్ డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్

NASA SpaceX mission to bring back Sunita Williams on way to ISS
  • 8 రోజుల ప్రయోగాల కోసం జూన్‌లో ఐఎస్ఎస్‌కు వెళ్లిన సునీతా
    విలియమ్స్, బారీ విల్‌మోర్
  • బోయింగ్ స్టార్ లైనర్‌లో లోపాల కారణంగా అక్కడే చిక్కుకుపోయిన వ్యోమగాములు
  • వారిని తీసుకొచ్చేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం
  • ఇప్పుడు క్రూ-9 వ్యోమగాములతో బయలుదేరిన స్పేస్‌ఎక్స్ డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్
  • వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఇందులోనే సునీతా, విల్‌మోర్ వెనక్కి
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో చిక్కుకున్న వ్యోమగామి సునీతా విలియమ్స్‌ను వెనక్కి తీసుకొచ్చేందుకు నాసా-స్పేస్ఎక్స్ మిషన్ బయలుదేరింది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా)కు చెందిన క్రూ-9 వ్యోమగాములు నిక్‌హాగ్ (కమాండర్), రోస్‌కోమోస్ కాస్మోనాట్ అలెగ్జాండర్ గోర్బునోవ్ (మిషన్ స్పెషలిస్ట్)లతో ఆదివారం ఐఎస్ఎస్‌కు బయలుదేరింది. ఫ్లోరిడాలోని కేప్‌కెనావెరల్ నుంచి నింగికి ఎగసిన స్పేస్‌ఎక్స్ డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్ ఆ తర్వాత విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశించింది.

ప్రస్తుతం అది ఐఎస్ఎస్ దారిలో ఉందని, ఐదు నెలల సైన్స్ మిషన్ కోసం వెళ్లిన కొత్త వ్యోమగాములు ఆదివారం ఆర్బిటింగ్ ల్యాబ్‌కు చేరుకున్నారని ఎక్స్ ద్వారా నాసా వెల్లడించింది. భారతీయ కాలమానం ప్రకారం నేటి మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో  ఐఎస్ఎస్‌తో స్పేస్‌క్రాఫ్ట్ డాకింగ్ అవుతుంది. సునీతా విలియమ్స్, బారీ విల్‌మోర్ ఇందులోనే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో భారత్ చేరుకుంటారు. నిజానికి ఈ మిషన్ ప్రయోగం గురువారమే చేపట్టాల్సి ఉండగా అమెరికాలో బీభత్సం సృష్టిస్తున్న తుపాను కారణంగా వాయిదా పడింది. 

సునీతా విలియమ్స్, విల్‌మోర్ ఇద్దరూ కేవలం ఎనిమిది రోజుల కోసమే ఐఎస్ఎస్‌కు చేరుకున్నారు. అయితే, వారిని తీసుకెళ్లిన బోయింగ్ స్టార్‌లైనర్‌లో సాంకేతిక లోపాల కారణంగా, మానవ ప్రయాణానికి అనుకూలంగా లేకపోవడంతో వారిని అక్కడే వదిలేసి వెనక్కి వచ్చింది. దీంతో జూన్ 5 నుంచి వారు అక్కడే గడుపుతున్నారు.
NASA-SpaceX Mission
Sinita Willams
Barry Wilmore
ISS

More Telugu News