తెలంగాణలో లోక్ సభ ఎన్నికల్లో 77 లక్షల ఓట్లు వచ్చాయి... 50 లక్షల సభ్యత్వం కష్టమేమీ కాదు: జేపీ నడ్డా
- 15 రోజుల్లో లక్ష్యాన్ని పూర్తి చేయాలని దిశానిర్దేశనం
- అన్ని వర్గాలను కలిసి సభ్యత్వం తీసుకోవాలని జేపీ నడ్డా సూచన
- స్థానిక సమస్యలపై కూడా పోరాటం చేయాలని సూచన
అన్ని వర్గాలను కలిసి సభ్యత్వం తీసుకోవాలని జేపీ నడ్డా సూచించారు. అత్యధిక సభ్యత్వం నమోదు చేయించిన వారికే పదవులు దక్కుతాయన్నారు. సభ్యత్వ నమోదుతో పాటు స్థానిక సమస్యలపై పోరాటం చేయాలని, అప్పుడే ప్రజలు మన వైపు ఉంటారని హితబోధ చేశారు. ఆయన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, గత ఎన్నికల్లో పోటీ చేసిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులతో హైదరాబాదులో సమావేశమయ్యారు.