Shikhar Pahariya: 'దేవ‌ర‌'లో జాన్వీ కపూర్​ న‌ట‌న‌పై ఆమె బాయ్‌ఫ్రెండ్ ఆస‌క్తిక‌ర‌ కామెంట్స్

Shikhar Pahariya Praises his Girlfriend Janhvi Kapoor Performance in Devara
  • ఎన్‌టీఆర్‌, జాన్వీ కపూర్ జంట‌గా దేవర మూవీ
  • నిన్న వ‌ర‌ల్డ్‌వైడ్‌గా సినిమా విడుద‌ల
  • తాజాగా ఈ మూవీని వీక్షించిన‌ జాన్వీ బాయ్‌ఫ్రెండ్ శిఖర్‌ పహరియా
  • సినిమాలోని ఆమె న‌ట‌న‌కు ఫిదా అయినట్లు వెల్ల‌డి
  • జాన్వీ యాక్టింగ్ సింప్లీ సూప‌ర్బ్ అంటూ ప్ర‌శంస‌
గ్లోబ‌ల్ స్టార్ ఎన్‌టీఆర్‌, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జంట‌గా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన‌ దేవర మూవీ శుక్ర‌వారం వ‌ర‌ల్డ్‌వైడ్‌గా విడుద‌లైన విష‌యం తెలిసిందే. మొద‌టి ఆట నుంచే తార‌క్ సినిమా పాజిటివ్‌ టాక్ సొంతం చేసుకుంది. దీంతో తొలిరోజు భారీ క‌లెక్ష‌న్లు కొల్ల‌గొట్టింది. 

ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ సినిమాకు మొద‌టిరోజు ఏకంగా రూ.172 కోట్లు రాబ‌ట్టిన‌ట్లు తాజాగా మేక‌ర్స్ ఓ స్పెష‌ల్ పోస్ట‌ర్ ద్వారా ప్ర‌క‌టించారు. 

ఇక ఈ చిత్రంలోని జాన్వీ కపూర్ న‌ట‌న‌పై ఆమె బాయ్‌ఫ్రెండ్ శిఖర్‌ పహరియా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. తాజాగా ఈ మూవీని చూసిన అతడు జాన్వీ న‌ట‌న‌కు ఫిదా అయినట్లు తెలిపాడు. తెరపై ఆమె అప్పియరెన్స్ కు మ‌తిపోయినట్లు పేర్కొన్నాడు. సింప్లీ సూప‌ర్బ్ యాక్టింగ్ అంటూ ప్ర‌శంస‌లు కురిపించాడు. 

"నేనేమైనా కలగంటున్నానా?" అంటూ మూవీలోని జాన్వీ ఫొటోను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. దీంతో ప్ర‌స్తుతం అత‌ని పోస్ట్ నెట్టింట వైర‌ల్ అవుతోంది. 
 
కాగా, శిఖర్‌ పహరియా... మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్‌కుమార్‌ షిండే మనవడు అనే విష‌యం తెలిసిందే. గ‌త కొంత‌కాలంగా జాన్వీ క‌పూర్ అత‌నితో డేటింగ్‌లో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ జంట త‌ర‌చూ బాలీవుడ్లో జరిగే పార్టీలకు హాజ‌ర‌వుతుంటారు. అలాగే తిరుమలకు కూడా కలిసి వెళుతుంటారు.
Shikhar Pahariya
Janhvi Kapoor
Devara
Tollywood

More Telugu News